Sunday, 31 May 2026
  • Home  
  • బెంగాల్‌లో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం
- News

బెంగాల్‌లో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం

పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి సోమవారం మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 54 శాఖల్లో 42 శాఖలను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కొత్త మంత్రివర్గంలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రాంతీయ, సామాజిక సమతుల్యతకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. షెడ్యూల్డ్ కులాలు, గిరిజనులు, మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించే దిశగా పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. జూన్ 22 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే మంత్రివర్గ కూర్పును ఖరారు చేయనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.