నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బీసీ భవన్, అంబేద్కర్ భవన్, బాబు జగ్జీవన్‌రామ్ భవనాల నిర్మాణ పనులను ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ బీసీ భవన్ నిర్మాణానికి మంత్రి నారాయణ, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు చెరో రూ.కోటి అందించడం సంతోషకరమన్నారు. ఈ నెల 22న బీసీ భవన్ పనులు, అక్టోబర్‌లో అంబేద్కర్ భవన్ పనులు పునఃప్రారంభిస్తామని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సంబంధిత భవనాలను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ నాయకులు పాల్గొన్నారు.













