ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 18 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండల కేంద్రంలోని పిడూరు రోడ్డులో ప్రతిష్ఠించిన భారీ వినాయకుడిని దర్శించుకునేందుకు గురువారం రాత్రి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రూ.4 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అర్చకులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో గణపతి పూజ, ప్రత్యేక అర్చనలు, నైవేద్య కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉభయకర్తలు అన్నాబత్తిన రమేష్, సునీత దంపతులు, వారి కుమారుడు హేమంత్‌కుమార్, సిరి దంపతులు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించడంతో పిడూరు రోడ్డులో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

పిడూరు రోడ్డు వినాయకుడికి పోటెత్తిన భక్తులు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 18 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల కేంద్రంలోని పిడూరు రోడ్డులో ప్రతిష్ఠించిన భారీ వినాయకుడిని దర్శించుకునేందుకు గురువారం రాత్రి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రూ.4 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అర్చకులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో గణపతి పూజ, ప్రత్యేక అర్చనలు, నైవేద్య కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉభయకర్తలు అన్నాబత్తిన రమేష్, సునీత దంపతులు, వారి కుమారుడు హేమంత్‌కుమార్, సిరి దంపతులు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించడంతో పిడూరు రోడ్డులో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

