Saturday, 15 August 2026
  • Home  
  • # దేశల్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- మేడ్చల్ – మల్కాజిగిరి

# దేశల్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

# దేశల్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ### జాతీయ జెండాను ఆవిష్కరించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ **కూకట్‌పల్లి, ఆగస్టు 15:** భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీ గొట్టుముక్కల జస్వంత్ రావు (దేశల్) ఆధ్వర్యంలో KPHB మెట్రో స్టేషన్ సమీపంలోని దేశల్ అన్న కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర PCC ఉపాధ్యక్షులు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ శ్రీ బండి రమేష్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశల్ మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ జీవిస్తున్నామని అన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశభక్తి, ఐక్యత, సోదరభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని, యువత దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని దేశల్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, AMC చైర్మన్, KPHB బ్లాక్ అధ్యక్షులు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, దేశల్ మిత్రమండలి సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం దేశభక్తి నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం మార్మోగింది. **జై హింద్! 🇮🇳🇮🇳🇮🇳**

# దేశల్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

### జాతీయ జెండాను ఆవిష్కరించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్

**కూకట్‌పల్లి, ఆగస్టు 15:** భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీ గొట్టుముక్కల జస్వంత్ రావు (దేశల్) ఆధ్వర్యంలో KPHB మెట్రో స్టేషన్ సమీపంలోని దేశల్ అన్న కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర PCC ఉపాధ్యక్షులు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ శ్రీ బండి రమేష్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దేశల్ మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ జీవిస్తున్నామని అన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశభక్తి, ఐక్యత, సోదరభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని, యువత దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని దేశల్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, AMC చైర్మన్, KPHB బ్లాక్ అధ్యక్షులు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, దేశల్ మిత్రమండలి సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం దేశభక్తి నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం మార్మోగింది.

**జై హింద్! 🇮🇳🇮🇳🇮🇳**

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.