చిట్వేల్ మండల టీడీపీ కార్యాలయంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు, టీడీపీ శ్రేణులు ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బీసీల రాజకీయ, సామాజిక సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కృషి చేస్తోందని బీసీ సంఘం నాయకుడు సేతు శంకరయ్య యాదవ్ పేర్కొన్నారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, అవకాశాలు కల్పించడంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన రమాదేవికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించడం బీసీలకు పార్టీ ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో టీడీపీ చిట్వేల్ మండల అధ్యక్షుడు కాకర్ల నాగార్జున నాయుడు, లారీ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై టీడీపీ కృతజ్ఞత