ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్)
బీజేపీ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లా కార్యాలయానికి విచ్చేసిన శ్రీరామనేని మణిని జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రెగండ్ల ప్రతాప్, పృథ్వి సుదర్శన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



