Wednesday, 29 July 2026
  • Home  
  • బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కళ్ళకు గంతలతో నిరసన
- మంచిర్యాల

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కళ్ళకు గంతలతో నిరసన

బెల్లంపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి రోడ్ల విస్తరణ పేరుతో దుకాణాలు, చిన్నచిన్న టేలలు తొలగించి వ్యాపారులను, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. బెల్లంపల్లి పట్టణ ప్రజల సమస్యలను, పట్టణంలో జరుగుతున్న భూ కబ్జాలను ఎమ్మెల్యే కళ్ళు తెరచి చూడాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేతలు ప్రారంభించి మధ్యలోనే నిలిపివేయడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన మండిపడ్డారు. జిఎం ఆఫీస్ రోడ్డు, బెల్లంపల్లి బస్తీ రోడ్, శిశుమందిర్ రోడ్ విస్తరణ పనులు ఎక్కడికక్కడే నిలిపివేశారని విమర్శించారు.. వెంటనే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభంచి, రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం చూపాలని ఆయన కోరారు. అదేవిధంగా బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రిలో సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే నియామకాలు చేపట్టాలని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే 350 ఎకరాలలో స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ను ప్రస్తుత ఎమ్మెల్యే వినోద్ నిర్లక్ష్యం చేయడంతో యువతకు ఉపాధి లేక వచ్చిన కంపెనీలు వెనుక పోయే పరిస్థితి నెలకొందన్నారు.. అదేవిధంగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో అర్హులైన మిగతా వారికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంపిణి చేసినట్లుగా 76-జీవో ప్రకారం ఇళ్ల పట్టాలు వెంటనే మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బత్తుల సుదర్శన్ బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్, పట్టణ అధ్యక్షులు నూనెటి సత్యనారాయణ, రేవెల్లి విజయ్, సబ్బని అరుణ్, కౌన్సిలర్లు తాండ్ర స్రవంతి, బండారి స్రవంతి బెడ్డల సౌజన్య, అసాది మధు, గోగార్ల స్వప్న, కొయ్యాడా ప్రసన్న, రజిత,రాజకుమార్, కాంపెల్లి రాజం, సిమ్రాన్ ఖలీం, నాయకులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.