ఖమ్మం ఆగష్టు 13
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం: నగరంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొనేందుకు ఖమ్మం వచ్చిన బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి జిల్లా ఇంచార్జి బద్దం మహిపాల్పా రెడ్డి లకి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రేఖ సత్యనారాయణ యాదవ్, పాలేరు అసెంబ్లీ ఇంచార్జి నున్న రవికుమార్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మంద సరస్వతి, సన్నే ఉదయ్ ప్రతాప్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రతాప్, రామకృష్ణ, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు సాయిరామ్, గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొని ప్రేమేందర్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొని జాతీయ జెండాలతో దేశభక్తిని చాటారు. ర్యాలీ విజయవంతం కావడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.



