కొండాపురం మండలం గానుగపెంట ఎస్సీ కాలనీకి చెందిన జడ రసూల్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మృతుడి స్వగృహానికి వెళ్లి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. మృతికి గల నిజాలు వెలుగులోకి తెచ్చి, బాధ్యులకు శిక్ష పడేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.




