Tuesday, 12 May 2026
  • Home  
  • బలవంతపు భూ సేకరణ ఉండదు : తహసీల్దార్ లక్ష్మీ లావణ్య
- తూర్పు గోదావరి

బలవంతపు భూ సేకరణ ఉండదు : తహసీల్దార్ లక్ష్మీ లావణ్య

తాళ్లపూడి, మే 12 (పున్నమి ప్రతినిధి) : తాళ్లపూడి మండల పరిధిలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తహసీల్దార్ లక్ష్మీ లావణ్య తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొంటూ, భూములు ఇవ్వడానికి ఆసక్తి ఉన్న రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆమె కోరారు. పది ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఒకే బ్లాక్‌గా ఉన్న భూములను విక్రయించేందుకు లేదా లీజుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రైతులు తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. రైతుల అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతపు భూ సేకరణ జరగదని స్పష్టం చేశారు. రైతుల అభిప్రాయాలు, అంగీకారాన్ని గౌరవిస్తూ పూర్తిగా స్వచ్ఛంద విధానంలోనే భూముల స్వీకరణ జరుగుతుందని తెలిపారు. భూ సేకరణకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా వివరాలు తెలుసుకోవాలనుకునే వారు తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని లక్ష్మీ లావణ్య సూచించారు.

తాళ్లపూడి, మే 12 (పున్నమి ప్రతినిధి) : తాళ్లపూడి మండల పరిధిలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తహసీల్దార్ లక్ష్మీ లావణ్య తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొంటూ, భూములు ఇవ్వడానికి ఆసక్తి ఉన్న రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆమె కోరారు.
పది ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఒకే బ్లాక్‌గా ఉన్న భూములను విక్రయించేందుకు లేదా లీజుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రైతులు తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. రైతుల అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతపు భూ సేకరణ జరగదని స్పష్టం చేశారు.
రైతుల అభిప్రాయాలు, అంగీకారాన్ని గౌరవిస్తూ పూర్తిగా స్వచ్ఛంద విధానంలోనే భూముల స్వీకరణ జరుగుతుందని తెలిపారు. భూ సేకరణకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా వివరాలు తెలుసుకోవాలనుకునే వారు తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని లక్ష్మీ లావణ్య సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.