టీబీ ముక్త భారత్ 2.0 కార్యక్రమంలో ప్రజలకు అవగాహన
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
టీబీ ముక్త భారత్ 2.0 కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆత్మకూరు మండలం మహిమలూరు పీహెచ్‌సీ పరిధిలోని బట్టేపాడు సబ్‌సెంటర్‌లో హ్యాండ్ హోల్డ్ ఎక్స్‌రే పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి మరియు అడిషనల్ డీఎంహెచ్‌వో ఖాదరవల్లి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమం డాక్టర్ దేవానంద్, డాక్టర్ అనూషకుమారి ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ప్రజలకు క్షయవ్యాధి (టీబీ)పై అవగాహన కల్పించారు. టీబీ లక్షణాలు, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. హ్యాండ్ హోల్డ్ ఎక్స్‌రే సాంకేతికత ద్వారా ప్రజలకు వేగంగా, సులభంగా పరీక్షలు నిర్వహించగా స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పరీక్షలు చేయించుకున్నారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సైదా, టీబీ సూపర్వైజర్ వెంకటేష్, హెల్త్ అసిస్టెంట్ నాగేంద్ర, ఏఎన్ఎం నాగమణి, ఎంఎల్‌హెచ్‌పీ ప్రశాంతి, జ్యోతి, శాంతి, ఆశ కార్యకర్తలు మరియు పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని, ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బంది ప్రజలకు సూచించారు.


