ఉదయగిరి,
ఏప్రిల్ 14: (ఉస్మాన్ పున్నమి ప్రతినిధి (
అంబేడ్కర్ జయంతి సందర్భంగా బండగానిపల్లిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆయన సతీమణి ప్రవీణ మరియు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రూ 46.80 లక్షల నిధులతో నిర్మించిన సి.సి రోడ్లు మరియు ‘స్వచ్ఛ రథాన్ని’ ప్రారంభించారు, 40 ఏళ్లుగా పట్టాల కోసం ఎదురుచూస్తున్న కొత్తపల్లి ఎస్టీ కాలనీకి చెందిన 32 మందికి ఇళ్ల పట్టాలతో పాటు చీర సారెలను అందజేశారు.
అలానే కూటమి ప్రభుత్వ సహకారంతో ఎస్టీ కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు, కార్యక్రమం అనంతరం ఎస్టీ సోదర సోదరీమణులతో కలిసి ఎమ్మెల్యే కాకర్ల సురేష్దం గారి ధంపతులు మరియు మాజి శాసన సభ్యులు విజయరామి రెడ్డి గారు మరియు నేతలు బంతి భోజనం చేశారు.



