ప్రైవేట్ కళాశాల వల్ల ఓ విద్యార్థి మృతి..
పున్నమి న్యూస్ ప్రతినిధి
19 ఏప్రిల్ 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
ఇబ్రహీంపట్నంలో ఉన్న శ్రీ ఇందు కళాశాల ఫీజుల కోసం పీడుస్తున్న కళాశాల యాజమాన్యం..
హాల్ టికెట్ ఇవ్వలేదని బిటెక్ విద్యార్థి 3 వ సం..చదువుతున్న మ్యాదరి ప్రణీత్ కుమార్ (22) హయత్ నగర్ లోని తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు.
శ్రీ ఇందు కలశాలలో కృష్ణమూర్తి అనే వ్యక్తి 30 నిమిషాల పాటు నిల్చోపెట్టి ఫీజు కట్టవలసిందే అని బెదిరింపులకు గురిచేసాడని ప్రణీత్ తండ్రి ఆరోపణ.
మనస్థాపానికి చెంది ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయాడు.
హయత్ నగర్ పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

