నెల్లూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీడీపీ నేత చెముకుల కృష్ణ చైతన్య.
నెల్లూరు :మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తీరు మార్చుకోవాలని, అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య హెచ్చరికలు చేశారు. కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలను, మహిళలను కించపరిచేలా ఆయన మాట్లాడిన తీరును తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య తీవ్రంగా ఖండించారు. శనివారం నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టారు.సంస్కారం లేని రాజకీయం ప్రసన్నకుమార్ రెడ్డిదని, ‘కోవూరు నియోజకవర్గ ప్రజలకు ప్రసన్నకుమార్ రెడ్డి భాష, ఆయన ఆలోచనా విధానం కొత్తేమీ కాదు. ‘ఎచ్చోట కర్మ అచ్చోటనే అనుభవిస్తారు’ అని భగవద్గీతలో చెప్పినట్లు.. ఎవరు చేసిన పనుల ఫలితాన్ని వాళ్లే అనుభవించక తప్పదని చెప్పారు. ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడిన నీచమైన భాషను అందరూ చూశారని, నిన్న ఆయన మాట్లాడుతూ ‘నేనేం తప్పు చేశాను.. మా మేనత్త కోడలు మాకు చెల్లెలు అవుతుంది’ అంటూ కబుర్లు చెబుతున్నారని అన్నారు.ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు అన్నట్లు.. ఆయన పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సొంత చెల్లి గురించి ఏం మాట్లాడారో రాష్ట్రమంతా చూసిందని, ప్రసన్నకుమార్ రెడ్డి కూడా ఆయనకు తగ్గ వారసుడేనని అన్నారు. ప్రశాంతిరెడ్డి నామినేషన్ వేసినప్పటి నుంచి, ఆయన చేసిన సెటైర్లు, మాట్లాడిన భాష ఏ అన్న అయినా చెల్లి గురించి మాట్లాడే భాషా? అని ప్రశ్నిస్తున్నాం. 55 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన తర్వాత రుక్మణి కల్యాణమండపంలో కార్యకర్తల సమావేశంలో కూడా అంతకంటే నీచమైన భాష మాట్లాడారు. ప్రశాంతిరెడ్డి నిన్న రెచ్చగొట్టారని అబద్ధాలు చెబుతున్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు అలాంటి భాష మాట్లాడితే ఆమె అస్సలు ఊరుకోరు, ఖండిస్తారు. ఆమె నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని బిడ్డలా చూసుకుంటారు.’ అని చైతన్య చెప్పారు.వైసిపి హయాంలో దాడులు, దౌర్జన్యాలు” ‘రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, మీరు టీడీపీలో ఉండి ఆయనను ‘పంచెలు ఊడదీసి కొడతాం’ అన్నప్పుడు మీ సంస్కారం ఏమైంది? నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి, మంత్రి పదవి భిక్ష పెట్టిన నారా చంద్రబాబు నాయుడుని ‘చెట్టుకి కట్టేసి కొడతాం’ అని మాట్లాడారు. లోకేష్ పై మీరు వాడిన భాష మీ సంస్కారానికి అద్దం పడుతోంది. మీరు వైసీపీ నుంచి గెలిచిన నెలరోజులకే జొన్నవాడ ఆలయ మాజీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యం నాయుడి ఇంటిపై మీ కార్యకర్తలు దాడి చేస్తే, వీధిలోకి వచ్చి క్షమాపణలు చెప్పింది మీరు కాదా? దాడి చేసిన వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? రావూరులో బాలబొమ్మ వెంకటేశ్వరులు ఇల్లు కూలగొడుతుంటే… ప్రోత్సహించారు. యల్లాయపాళెంలో రాజా ఎంపీటీసీని పోలీసుల ముందే కొట్టి, రక్తం కార్చితే ఏం చర్యలు తీసుకున్నారు? రాజుపాళెం, కరకట్ట మల్లికార్జునపై దాడులు, ముదువర్తిలో ఇమాంభాష ఇల్లు కూలగొట్టడానికి జేసీబీలు పంపినప్పుడు, రాముడిపాళెంలో బలవంతంగా భూములు లాక్కున్నప్పుడు మీ సంస్కారం ఎటు పోయింది?’ అని చైతన్య నిలదీశారు.రెండేళ్లలోనే రూ. 770 కోట్ల అభివృద్ధి” ‘ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నేతృత్వంలో, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆలోచనలతో, కోవూరు నియోజకవర్గం పంటకాలువలు, సంక్షేమం, గుడుల అభివృద్ధి, ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చడంలో ఎంతో ముందుంది. కేవలం రెండేళ్లలోనే దాదాపు రూ.770 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ట్రైసైకిల్స్, వీపీఆర్ నేత్ర ద్వారా ఉచిత కంటి వైద్య సేవలు అందిస్తూ.. ప్రజల గుండెల్లో నిలిచారు. నీలాంటి వాళ్లతో కయ్యాలు పెట్టుకునే తీరిక మా ఎమ్మెల్యే కి లేదు. మహిళలను కించపరిస్తే, గొడవలు పెడితే జగన్ మళ్లీ టికెట్ ఇస్తాడనే ఆశతోనే ప్రసన్నకుమార్ రెడ్డి ఇలా నోరు పారేసుకుంటున్నారని అన్నారు. కీర్తిశేషులు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడిగా మీ ప్రవర్తన ఎలా ఉందో, మీ దగ్గర ప్రామిసరీ నోట్లు రాయించుకుని, చెక్కులు ఇచ్చిన వందల మంది కోవూరు ప్రజలను అడిగితే తెలుస్తుంది. 2009లో వైఎస్సార్ గెలవగానే టిడిపి కార్యకర్తలను ముంచి పార్టీ మారింది మీరు కాదా?’ అని ప్రశ్నించారు. “కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఆగ్రహం” ‘వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా సంస్కారం గురించి మాట్లాడుతున్నారని, ఉదయం లేస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మీరెలాంటి భాష వాడుతున్నారో చూసుకోండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టిడిపి చేర్చుకోకపోతే వైసీపీ చేర్చుకుందని కాకాణి అబద్ధాలు చెబుతున్నారని, వేమిరెడ్డి సేవలు చూసి టీడీపీ అప్పుడే చేర్చుకోవాలనుకుందని, కానీ తుఫాను పరిస్థితులు, మారిన సమీకరణాల వల్ల ఆయన వైసీపీలో చేరారు. మీ పార్టీ వల్ల ఆయనకు గుర్తింపు రాలేదు.. ఆయన వల్లే మీ వైసిపికి పేరు వచ్చిందని, పది నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు లబ్ధి పొంది గెలిచారని చెప్పారు. మీ వల్ల వేమిరెడ్డి వ్యక్తిగతంగా నష్టపోయారని, అవమానాలు పడ్డారని అన్నారు. అందుకే రాష్ట్ర, నెల్లూరు భవిష్యత్తు కోసం మళ్లీ టీడీపీలోకి వచ్చారని చెప్పారు. ఎన్నికల సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నుంచి మీరు ఆర్థిక లబ్ధి పొందలేదా? దీనికి కాకాణి సమాధానం చెప్పగలరా?’ అని సవాల్ విసిరారు. “అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. అవినీతిపై సమాధానం చెప్పండి” ‘రెండేళ్లలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చేసిన అభివృద్ధిపై అన్ని రకాల ఆధారాలతో చర్చకు మేం సిద్ధం. గత ఐదేళ్లలో మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ము ప్రసన్నకుమార్ రెడ్డికి ఉందా? టీడీనీ కార్యకర్తలను భయపెట్టడం మీ తరం కాదు. మీ దోపిడీ వల్ల కనిగిరి రిజర్వాయర్ పోయింది. తలమంచి, కొడవలూరు, ఎల్లాయపాళెం, కొత్తవంగళూరులో వందల కోట్ల గ్రావెల్ మాఫియా, ఇసుక దందా, ఎఫ్‌డీఆర్ పనుల్లో వందల కోట్ల అవినీతి జరిగింది. నియోజకవర్గంలో గంజాయి యథేచ్ఛగా దొరుకుతోంది. వీటన్నింటికీ సమాధానం చెప్పిన తర్వాతే ప్రసన్నకుమార్ రెడ్డి సంస్కారం గురించి మాట్లాడాలి. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే, వ్యక్తిగత విమర్శలు చేస్తే ఖచ్చితంగా తగిన రీతిలో బుద్ధి చెబుతాం’ అని చెముకుల కృష్ణ చైతన్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో MSME డైరెక్టర్ రావెళ్ల వీరేంద్ర నాయుడు, డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ బత్తల హరికృష్ణ, కోవూరు మండల పార్టీ అధ్యక్షుడు కొల్లరెడ్డి సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ గరికిపాటి రాజేంద్ర,కరకట్ట మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.


