పున్నమి ప్రతినిధి ,రామచంద్రపురం జూలై 30
రామచంద్రపురం మండలం సొరకాయల పాల్యం గ్రామంలో ఉన్న ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు దాదాపు 70 మంది విద్యార్థులకు సొసైటీ ఫర్ సోషల్ సర్వీస్ సంస్థ తిరుపతి కార్యదర్శి సి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఉచితంగా విద్యా సామాగ్రి మరియు దుస్తులు, బుక్స్, పెన్సిల్స్, వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ హాస్టల్ వార్డెన్ ఎం అంజప్ప నాయక్ చేతులు మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యాసామగ్రిని చక్కగా ఉపయోగించుకుని శ్రద్ధతో చదువుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. విద్యార్థులు విద్యతో పాటు వినయం పెద్దలపై గౌరవం అలవర్చుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా హాస్టల్ వార్డెన్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా హాస్టల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సొసైటీ ఫర్ సోషల్ సర్వీస్ తిరుపతి సంస్థ వారు అందిస్తున్న విద్యాసామగ్రి వారి ప్రోత్సాహం విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని, ఆ సంస్థ చేస్తున్న ఎన్నో కార్యక్రమాల గురించి కొనియాడారు. సంస్థ ఆర్గనైజర్ ఎస్ యువరాజు యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా విద్యనభ్యసించి మంచి ప్రయోజకులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సంస్థ ప్రతినిధులు, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు





