ప్రతి రైతుకూ 11 అంకెల విశిష్ట సంఖ్య తప్పనిసరి
పున్నమి, కడప :
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పీఎం కిసాన్ తదితర ప్రయోజనాలు పొందేందుకు రైతులు 11 అంకెల విశిష్ట రైతు గుర్తింపు సంఖ్యను నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.
రైతు సేవా కేంద్రాల్లో ఈ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు.
— పున్నమి, కడప

