దేశ రాజకీయ పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, ఎన్నికల అంశాలపై సమన్వయం పెంచేందుకు ఇండియా కూటమి ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. తదుపరి సమావేశాన్ని ఆగస్టులో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో కూడా ప్రతిరోజూ సమన్వయ సమావేశాలు నిర్వహించి ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేయాలని కూటమి నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల మధ్య ఐక్యతను బలోపేతం చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని నాయకులు తెలిపారు.

ప్రతి రెండు నెలలకు ఇండియా కూటమి సమావేశాలు