ఖమ్మం ఆగష్టు 13
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం: ప్రతి ఒక్కరూ తమ తమ నివాసాలపై విధిగా జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ విజ్ఞప్తి చేశారు. గురువారం ఖమ్మం నగరంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లో మరింత పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దేశ సమైక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.



