Monday, 14 September 2026
  • Home  
  • ప్రతిభావంతులకు VDC భాగాపూర్ ఘన సన్మానం
- నిర్మల్

ప్రతిభావంతులకు VDC భాగాపూర్ ఘన సన్మానం

భాగాపూర్ గ్రామానికి చెందిన ప్రతిభావంతులు వరుసగా ప్రభుత్వ ఉద్యోగాలు, వైద్య విద్యలో సీట్లు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా BPM ఉద్యోగం సాధించిన దర్శనం సుప్రజ S/o రాజన్న,, NEET పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS సీటు పొందిన అర్ష నవ్యశ్రీ S/o సాయన్న,, కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన పడిగేల శ్రీనిష S/o భోజన్నలను VDC భాగాపూర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా VDC చైర్మన్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన యువత విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రతిభ కనబరచడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. కష్టపడి చదివి, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించిన వీరు గ్రామంలోని ఇతర విద్యార్థులు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. వారి విజయాలు మరెంతో మంది యువతకు ప్రేరణగా నిలిచి, గ్రామం నుంచి మరిన్ని ఉన్నత విజయాలు సాధించేలా ప్రోత్సాహం కలిగించాలని ఆకాంక్షించారు. యువత తమ లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో VDC చైర్మన్ లింగారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ష ప్రసాద్, VDC సభ్యులు,యువత మరియు గ్రామస్తులు పాల్గొని సన్మాన గ్రహీతలను అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.