Friday, 11 September 2026
  • Home  
  • ప్రజా సేవలు నిలిచిపోతున్నా పట్టించుకోరా – 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్
- వరంగల్

ప్రజా సేవలు నిలిచిపోతున్నా పట్టించుకోరా – 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్

నర్సంపేట మున్సిపాలిటీలో పరిపాలన గాడి తప్పుతోందని, ప్రజలకు అందాల్సిన మున్సిపల్ సేవలు నిలిచిపోతున్నా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కమిషనర్ నుంచి సరైన స్పందన కనిపించడం లేదని 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ తీవ్రంగా విమర్శించారు. మున్సిపల్ పరిపాలనపై తగిన అనుభవం, అవగాహన కలిగిన అధికారిని నియమించాల్సిన అవసరం ఉందని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. సుమారు నెల రోజులుగా మున్సిపాలిటీ డిజిటల్ కీ హోల్డ్‌లో ఉన్నప్పటికీ సమస్యను పరిష్కరించడంలో కమిషనర్ తీసుకున్న చర్యలేమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. డిజిటల్ కీ సమస్య కారణంగా జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఇంటి నంబర్లు, ఆస్తుల మ్యుటేషన్లు, ట్రేడ్ లైసెన్సులు తదితర ప్రజా సేవలు ప్రభావితమవుతున్నాయని తెలిపారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజలకు సేవలు అందించడంలో ఎందుకు కనిపించడం లేదు అని నెల రోజులుగా డిజిటల్ కీ సమస్య కొనసాగుతున్నా పరిష్కారం ఎందుకు కాలేదు పెండింగ్ దరఖాస్తులపై కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని శ్రీధర్ ప్రశ్నించారు. డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న ప్రస్తుత కమిషనర్‌కు సంబంధించిన నియామక ఉత్తర్వులు, డిప్యూటేషన్ గడువు, కొనసాగింపు ఉత్తర్వులు, మున్సిపల్ పరిపాలనపై ఉన్న అనుభవం, కౌన్సిల్ విధివిధానాలపై అవగాహన తదితర అంశాలను జిల్లా కలెక్టర్ సమగ్రంగా పరిశీలించాలని శ్రీధర్ కోరారు. మున్సిపాలిటీ అంటే కేవలం కార్యాలయ నిర్వహణ కాదు.. ప్రజలకు నిరంతరాయంగా పౌర సేవలు అందించడం కమిషనర్ ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతలో ఎక్కడైనా వైఫల్యం ఉంటే దానిపై జిల్లా యంత్రాంగం జవాబుదారీతనాన్ని నిర్ధారించాలి అని అన్నారు. నర్సంపేటలాంటి ముఖ్యమైన మున్సిపాలిటీలో పరిపాలనా అనుభవం కలిగిన అధికారిని నియమించాల్సిన అవసరం ఉందని శ్రీధర్ స్పష్టం చేశారు. ప్రస్తుత కమిషనర్ పనితీరును సమీక్షించి, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. అలాగే డిజిటల్ కీ సమస్యను తక్షణమే పరిష్కరించి, నెల రోజులుగా పెండింగ్‌లో ఉన్న ప్రజా సేవలను ప్రత్యేక చర్యల ద్వారా వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. “కమిషనర్ పరిపాలనా వైఫల్యాల భారాన్ని ప్రజలు మోయాల్సిన పరిస్థితి రాకూడదు. ప్రజా సేవలు నిలిచిపోవడానికి ఎవరి నిర్లక్ష్యం కారణమైనా బాధ్యత వహించాల్సిందే. నర్సంపేట మున్సిపాలిటీ పరిపాలనను గాడిలో పెట్టే వరకు ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం” అని హన్మకొండ శ్రీధర్ స్పష్టం చేశారు.

నర్సంపేట మున్సిపాలిటీలో పరిపాలన గాడి తప్పుతోందని, ప్రజలకు అందాల్సిన మున్సిపల్ సేవలు నిలిచిపోతున్నా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కమిషనర్ నుంచి సరైన స్పందన కనిపించడం లేదని 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ తీవ్రంగా విమర్శించారు. మున్సిపల్ పరిపాలనపై తగిన అనుభవం, అవగాహన కలిగిన అధికారిని నియమించాల్సిన అవసరం ఉందని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
సుమారు నెల రోజులుగా మున్సిపాలిటీ డిజిటల్ కీ హోల్డ్‌లో ఉన్నప్పటికీ సమస్యను పరిష్కరించడంలో కమిషనర్ తీసుకున్న చర్యలేమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. డిజిటల్ కీ సమస్య కారణంగా జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఇంటి నంబర్లు, ఆస్తుల మ్యుటేషన్లు, ట్రేడ్ లైసెన్సులు తదితర ప్రజా సేవలు ప్రభావితమవుతున్నాయని తెలిపారు.
ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజలకు సేవలు అందించడంలో ఎందుకు కనిపించడం లేదు అని నెల రోజులుగా డిజిటల్ కీ సమస్య కొనసాగుతున్నా పరిష్కారం ఎందుకు కాలేదు పెండింగ్ దరఖాస్తులపై కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని శ్రీధర్ ప్రశ్నించారు.
డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న ప్రస్తుత కమిషనర్‌కు సంబంధించిన నియామక ఉత్తర్వులు, డిప్యూటేషన్ గడువు, కొనసాగింపు ఉత్తర్వులు, మున్సిపల్ పరిపాలనపై ఉన్న అనుభవం, కౌన్సిల్ విధివిధానాలపై అవగాహన తదితర అంశాలను జిల్లా కలెక్టర్ సమగ్రంగా పరిశీలించాలని శ్రీధర్ కోరారు.
మున్సిపాలిటీ అంటే కేవలం కార్యాలయ నిర్వహణ కాదు.. ప్రజలకు నిరంతరాయంగా పౌర సేవలు అందించడం కమిషనర్ ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతలో ఎక్కడైనా వైఫల్యం ఉంటే దానిపై జిల్లా యంత్రాంగం జవాబుదారీతనాన్ని నిర్ధారించాలి అని అన్నారు.
నర్సంపేటలాంటి ముఖ్యమైన మున్సిపాలిటీలో పరిపాలనా అనుభవం కలిగిన అధికారిని నియమించాల్సిన అవసరం ఉందని శ్రీధర్ స్పష్టం చేశారు. ప్రస్తుత కమిషనర్ పనితీరును సమీక్షించి, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
అలాగే డిజిటల్ కీ సమస్యను తక్షణమే పరిష్కరించి, నెల రోజులుగా పెండింగ్‌లో ఉన్న ప్రజా సేవలను ప్రత్యేక చర్యల ద్వారా వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
“కమిషనర్ పరిపాలనా వైఫల్యాల భారాన్ని ప్రజలు మోయాల్సిన పరిస్థితి రాకూడదు. ప్రజా సేవలు నిలిచిపోవడానికి ఎవరి నిర్లక్ష్యం కారణమైనా బాధ్యత వహించాల్సిందే. నర్సంపేట మున్సిపాలిటీ పరిపాలనను గాడిలో పెట్టే వరకు ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం” అని హన్మకొండ శ్రీధర్ స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.