ఖమ్మం నగరంలోని స్థానిక 51వ డివిజన్‌లో “మార్నింగ్ వాక్ విత్ ఉదయ ప్రతాప్” కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు డివిజన్‌లో పర్యటిస్తూ స్థానికులను కలిసి వారి సమస్యలు, సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు మహేందర్ సింగ్ రాజ్‌పుత్, ఖమ్మం రెండో పట్టణ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవ్, ఉపాధ్యక్షులు భూక్య వెంకట్, 51వ డివిజన్ 141వ బూత్ అధ్యక్షులు, జిల్లా సీనియర్ నాయకులు బొల్లా రాంబాబు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.



