Wednesday, 13 May 2026
  • Home  
  • ప్రజా తీర్పుతో ఏపీ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు- తెదేపా రాష్ట్ర కార్యదర్శి
- తిరుపతి

ప్రజా తీర్పుతో ఏపీ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు- తెదేపా రాష్ట్ర కార్యదర్శి

శ్రీకాళహస్తి, మే 13 (పున్నమి టెంపుల్ న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసిన 2024 మే 13 పోలింగ్‌కు నేటితో రెండేళ్లు పూర్తయ్యాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యం. సుబ్బయ్య పేర్కొన్నారు. బుధవారం శ్రీకాళహస్తిలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 81.86 శాతం భారీ పోలింగ్ నమోదైన రోజు ప్రజలు ప్రజాస్వామ్య శక్తిని చాటిచెప్పారని అన్నారు. అణచివేత, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారని, ఆ ప్రజా తీర్పే నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి చారిత్రాత్మక విజయానికి పునాది వేసిందని వివరించారు. 175 స్థానాలకు గాను 164 సీట్లతో కూటమి ఘన విజయం సాధించడం ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, యువత భవిష్యత్తు, ‘సూపర్ సిక్స్’ హామీలపై విశ్వాసంతో ప్రజలు అర్ధరాత్రి వరకు బారులు తీరారని సుబ్బయ్య గుర్తుచేశారు. ఈ ప్రజా తీర్పు రాష్ట్ర అభివృద్ధికి, అమరావతి పునర్నిర్మాణానికి దిక్సూచిగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ యం. ఉమేష్ రావు, తంగేళ్లపాళెం ప్యాక్స్ చైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి జి. మణి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.