Wednesday, 23 September 2026
  • Home  
  • ప్రజాసేవకు ప్రతీక ఏ. భీమ్‌రెడ్డి
- నిర్మల్

ప్రజాసేవకు ప్రతీక ఏ. భీమ్‌రెడ్డి

మునిపెల్లి, మల్లాపూర్ గ్రామాల్లో 33వ వర్ధంతి కార్యక్రమాలు లక్ష్మణ్‌చందా మండలం: మాజీ డిప్యూటీ స్పీకర్ ఏ. భీమ్‌రెడ్డి 33వ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం మునిపెల్లి, మల్లాపూర్ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమ్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన అందించిన ప్రజాసేవ, రాజకీయ ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఏ. భీమ్‌రెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని పలువురు పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భీమ్‌రెడ్డి కుమార్తె, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ స్వర్ణరెడ్డి, కుమారుడు భూపాల్‌రెడ్డితో పాటు మునిపెల్లి, మల్లాపూర్ గ్రామాల ప్రజలు పాల్గొని నివాళులర్పించారు. పున్నమి ప్రతినిధి – అబ్దుల్ సాదిక్, నిర్మల్

మునిపెల్లి, మల్లాపూర్ గ్రామాల్లో 33వ వర్ధంతి కార్యక్రమాలు
లక్ష్మణ్‌చందా మండలం: మాజీ డిప్యూటీ స్పీకర్ ఏ. భీమ్‌రెడ్డి 33వ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం మునిపెల్లి, మల్లాపూర్ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమ్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన అందించిన ప్రజాసేవ, రాజకీయ ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఏ. భీమ్‌రెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని పలువురు పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో భీమ్‌రెడ్డి కుమార్తె, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ స్వర్ణరెడ్డి, కుమారుడు భూపాల్‌రెడ్డితో పాటు మునిపెల్లి, మల్లాపూర్ గ్రామాల ప్రజలు పాల్గొని నివాళులర్పించారు.
పున్నమి ప్రతినిధి – అబ్దుల్ సాదిక్, నిర్మల్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.