ప్రగతి నగర్లో పోలీసుల కార్డన్ & సెర్చ్ ఆపరేషన్
కావలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ ప్రాంతంలో 23.05.2026న పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఉదయం 5:30 గంటల నుంచి 7:00 గంటల వరకు సాగిన తనిఖీల్లో సుమారు 250 ఇళ్లను పరిశీలించారు. పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నేరాల నివారణ, మత్తు పదార్థాల దుష్పరిణామాలు, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల IPS తెలిపారు.

ప్రగతి నగర్లో పోలీసుల కార్డన్ & సెర్చ్ ఆపరేషన్
ప్రగతి నగర్లో పోలీసుల కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ కావలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ ప్రాంతంలో 23.05.2026న పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఉదయం 5:30 గంటల నుంచి 7:00 గంటల వరకు సాగిన తనిఖీల్లో సుమారు 250 ఇళ్లను పరిశీలించారు. పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నేరాల నివారణ, మత్తు పదార్థాల దుష్పరిణామాలు, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల IPS తెలిపారు.

