ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 23 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన అభినందన సభ శనివారం ఎంఈఓ కార్యాలయం సమీపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి రాగయ్య మాట్లాడుతూ యూటీఎఫ్ ఉపాధ్యాయుల సంక్షేమంతో పాటు విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఆరు నెలలుగా విద్యార్థులకు మెటీరియల్ అందించి ప్రత్యేకంగా బోధిస్తున్నట్లు తెలిపారు. అధిక మార్కులు సాధించిన విద్యార్థులను గుర్తించి మెమెంటోలు అందజేయడం అభినందనీయమన్నారు. ప్రధానోపాధ్యాయురాలు వసంతకుమారి యూటీఎఫ్ సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు శ్రీనివాసులు గౌడ్, అనిల్ కుమార్, శ్యామల, రామయ్య, మహేంద్ర, తులసమ్మ తదితరులు పాల్గొన్నారు.

🎓 పదో తరగతి విద్యార్థులకు యూటీఎఫ్ ప్రోత్సాహం.. సేవలు అభినందనీయం: జిల్లా కార్యదర్శి రాగయ్య 🎓
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 23 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన అభినందన సభ శనివారం ఎంఈఓ కార్యాలయం సమీపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి రాగయ్య మాట్లాడుతూ యూటీఎఫ్ ఉపాధ్యాయుల సంక్షేమంతో పాటు విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఆరు నెలలుగా విద్యార్థులకు మెటీరియల్ అందించి ప్రత్యేకంగా బోధిస్తున్నట్లు తెలిపారు. అధిక మార్కులు సాధించిన విద్యార్థులను గుర్తించి మెమెంటోలు అందజేయడం అభినందనీయమన్నారు. ప్రధానోపాధ్యాయురాలు వసంతకుమారి యూటీఎఫ్ సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు శ్రీనివాసులు గౌడ్, అనిల్ కుమార్, శ్యామల, రామయ్య, మహేంద్ర, తులసమ్మ తదితరులు పాల్గొన్నారు.

