Wednesday, 5 August 2026
  • Home  
  • పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ వినతిపత్రం
- భద్రాద్రి కొత్తగూడెం

పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ వినతిపత్రం

ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమంలో భాగంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ఐటీడీఏ పీఓ, పినపాక నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాహుల్‌కు వినతిపత్రం అందజేశారు. సారపాక, తాళ్లగోమ్మూరు, కోయగూడెం గ్రామపంచాయతీలకు చెందిన పలువురు ఓటర్లు తమ నివాస ప్రాంతానికి దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయాల్సి వస్తోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఓటర్ల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమీపంలోని ఇప్పటికే ఉన్న పోలింగ్ కేంద్రాలకు బూత్‌లను మార్చాలని ఎన్నికల అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జలగం జగదీష్, కొనకంచి శ్రీనివాసరావు, తుపాకుల రవి, తిరుపతి ఏసోబు, సోము లక్ష్మీ చైతన్య రెడ్డి, చల్లకోటి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమంలో భాగంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ఐటీడీఏ పీఓ, పినపాక నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాహుల్‌కు వినతిపత్రం అందజేశారు.
సారపాక, తాళ్లగోమ్మూరు, కోయగూడెం గ్రామపంచాయతీలకు చెందిన పలువురు ఓటర్లు తమ నివాస ప్రాంతానికి దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయాల్సి వస్తోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఓటర్ల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమీపంలోని ఇప్పటికే ఉన్న పోలింగ్ కేంద్రాలకు బూత్‌లను మార్చాలని ఎన్నికల అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జలగం జగదీష్, కొనకంచి శ్రీనివాసరావు, తుపాకుల రవి, తిరుపతి ఏసోబు, సోము లక్ష్మీ చైతన్య రెడ్డి, చల్లకోటి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.