###
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి ఆహ్వానం మేరకు తులసినగర్లోని శ్రీ పోచమ్మ కనకదుర్గా సహిత అభయ ఆంజనేయస్వామి దేవస్థానంలో పీసీసీ సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, కాలనీ వాసులు ఆయనకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో కనకయ్య ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర చారి, పాండు యాదవ్, తులసినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అంకిత్ సింగ్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.



