రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ జులై 23 (పున్నమి ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కొమ్మటి అంజలి రాజమల్లు తన అభిమాన నాయకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా తన వ్యవసాయ పొలంలో “Happy Birthday KTR Sir” అని రాసి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, భవిష్యత్తులో తెలంగాణ ముఖ్యమంత్రిగా, దేశంలో ఉన్నత పదవులు అలంకరించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ప్రతి ఏడాది తన పొలంలో కేసీఆర్, కేటీఆర్ పేర్లతో వ్యవసాయ పనులు ప్రారంభిస్తూ తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకుంటానని రాజమల్లు తెలిపారు.



