Monday, 1 June 2026
  • Home  
  • పేదల సంక్షేమమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యం
- తిరుపతి

పేదల సంక్షేమమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యం

శ్రీ కాళహస్తి, జూన్ 01, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని పూసలవీధిలో సోమవారం నిర్వహించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి కూటమి నాయకులు లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. ఎం. ఉమేష్ రావు మాట్లాడుతూ…చేతల్లో సంక్షేమాన్ని చూపిస్తూ పేద ప్రజల బాగోగులు చూసుకోవడమే అసలైన రాజకీయమని ఎన్డీయే కూటమి ప్రభుత్వం నిరూపిస్తోందని అన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా కార్యక్రమంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కొనసాగుతోందన్నారు. జూన్ నెల పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.2,728 కోట్లు విడుదల చేయడంతో పాటు 5,606 కొత్త స్పౌజ్ పింఛన్లను మంజూరు చేసిందని తెలిపారు. సామాజిక భద్రత కోసం ఇప్పటివరకు రూ.65,886 కోట్లకు పైగా వ్యయం చేసి పేదల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అభినందనీయమని, సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక విమర్శలకు దిగుతున్నాయని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు వజ్రం కిషోర్, చాంద్ బాషా, బి. గిరిధర్, కోట చంద్రశేఖర్, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.