Monday, 1 June 2026
  • Home  
  • డ్రగ్స్ నిర్మూలనకు జిల్లాలో ముమ్మర చర్యలు
- తిరుపతి

డ్రగ్స్ నిర్మూలనకు జిల్లాలో ముమ్మర చర్యలు

ఏర్పేడు, జూన్ 01, (పున్నమి న్యూస్) : రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాలు, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సూచనల మేరకు జిల్లాలో చేపట్టిన “డ్రగ్స్‌పై దండయాత్ర–2.0” కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలోని పుష్పిత్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద ప్రత్యేక డ్రగ్ అవగాహన, గుర్తింపు పరీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు ఎస్పీ (క్రైమ్స్) ఆర్ల శ్రీనివాసరావు నేతృత్వంలో, రేణిగుంట సబ్‌డివిజన్ పోలీసు అధికారి వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. “పరీక్ష చేద్దాం–మత్తును వదిలిద్దాం” అనే నినాదంతో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రగ్ డిటెక్షన్ బస్సు, ఆధునిక పరీక్షా కిట్ల సహాయంతో మేర్లపాక పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 300 మందికి గంజాయి వినియోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువత భవిష్యత్తును దెబ్బతీసే మాదకద్రవ్యాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని అధికారులు తెలిపారు. గంజాయి వినియోగం, నిల్వ, రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతోందని, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. డ్రగ్స్ పరీక్షల్లో తొలిసారి పాజిటివ్‌గా తేలిన వారికి కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందజేస్తామని, పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు, ఏర్పేడు ఇన్‌స్పెక్టర్ శ్రీకాంతరెడ్డి, ఎస్‌ఐ రవిప్రకాష్, పోలీసు సిబ్బందితో పాటు పుష్పిత్ ఇండస్ట్రీస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పి. రామకృష్ణాచారి, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.