Tuesday, 25 August 2026
  • Home  
  • పెన్‌డౌన్ ఉద్యమం ఐదో రోజుకు చేరింది
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పెన్‌డౌన్ ఉద్యమం ఐదో రోజుకు చేరింది

జీవో నెం.396 రద్దు చేయాలని ఆత్మకూరులో దస్తావేజు లేఖరుల నిరసన ఆత్మకూరు, జూలై 24 ( హరికిరణ్,పున్నమి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్ ఉద్యమం ఐదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆత్మకూరు (902) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజా–ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానం అమలుతో దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నెం.396ను వెంటనే ఉపసంహరించుకోవాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా దస్తావేజుల తయారీ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే వరకు రాష్ట్రవ్యాప్తంగా తమ పెన్‌డౌన్ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరులు ఖాజా రంతుల్లా, హరీష్ నాయుడు, కె. వెంకటేశ్వర్లు, రమేష్ నాయుడు, పెంచలయ్య, గణేష్‌తో పాటు , డీటీపీ ఆపరేటర్లు, లేఖరి సహాయకులు పాల్గొన్నారు.

జీవో నెం.396 రద్దు చేయాలని ఆత్మకూరులో దస్తావేజు లేఖరుల నిరసన

ఆత్మకూరు, జూలై 24 ( హరికిరణ్,పున్నమి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్ ఉద్యమం ఐదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆత్మకూరు (902) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజా–ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానం అమలుతో దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నెం.396ను వెంటనే ఉపసంహరించుకోవాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా దస్తావేజుల తయారీ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే వరకు రాష్ట్రవ్యాప్తంగా తమ పెన్‌డౌన్ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరులు ఖాజా రంతుల్లా, హరీష్ నాయుడు, కె. వెంకటేశ్వర్లు, రమేష్ నాయుడు, పెంచలయ్య, గణేష్‌తో పాటు , డీటీపీ ఆపరేటర్లు, లేఖరి సహాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.