గద్వాల జిల్లా దరూర్ మండల పరిధిలోని పెద్ద చింతరేవుల గ్రామంలో 18వ శతాబ్దకాలంలో కృష్ణానది తీరాన,జూరాల ప్రాజెక్టు పక్కన వెలసిన ఆంజనేయ స్వామి వారికి ఆషాడ కృష్ణ దశమి శనివారం నాడు ఉత్తరాది మఠం పీఠాధిపతులు 1008 విద్యా దేశ తీర్థ శ్రీ పాదుల వారు,1008 విద్యా రాజేశ్వర తీర్థ శ్రీపాదుల వారు శనివారం నాడు పెద్ద చింతరేవుల ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు, అలంకరణ, అష్టోత్తర, మహా మంగళహారతి పూజలు వేద మంత్రో చరణాల మధ్య నిర్వహించారు.ఆధ్యాత్మికత భక్తులకు మానసిక ప్రశాంతత మరియు ఐశ్వర్యాలతో స్వామివారిని కోలవడం, స్వామివారి కృపా కటాక్షాలు పొందుటకు,సుగమం అవుతుందని అన్నారు. ఆంజనేయ స్వామి వారిని పూజించిన భక్తులకు ధీరత్వం ధైర్యం సాహసం విశేషమేతంగా ఉంటుందని అన్నారు. పెద్ద చింతరేవుల అన్న ప్రసాద కమిటీ వారిచే స్వామివారిని దర్శించుకున్న భక్తులందరికీ అన్న ప్రసాద పంపిణీ, అల్పార పంపిణీ చేశారు.నేటి నుండి 55 రోజులపాటు ఆలయాన్ని సందర్శించిన భక్తులందరికీ అల్పాహార,అన్నప్రసాద వసతి ఉందని,వినియోగించుకోవాలని ఆయన కోరారు.18వ శతాబ్దంలో వ్యాస శేషదాసుల వారు ప్రతిష్టించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆద్య చక్రవర్తి కేశవాచార్యులు వివరించారు. భక్తులు గురువులను సందర్శించిన, సేవచేసిన, గురువులను పూజించిన గురుబలం ప్రార్థిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆద్య వామనాచారి, ఆద్య కిష్టా చారి,ఆద్య మద్వాచారి పూజారులు,భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

పెద్దచింతరేవుల ఆంజనేయ స్వామికి ఉడిపి,పాలిమర్ పీఠాధిపతుల ప్రత్యేక పూజలు…