Wednesday, 9 September 2026
  • Home  
  • పెదనా పల్లి రెగ్యులేటర్ నుండి గోదావరి జలాలు విడుదల చేసేందుకు చర్యలుఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
- తూర్పు గోదావరి

పెదనా పల్లి రెగ్యులేటర్ నుండి గోదావరి జలాలు విడుదల చేసేందుకు చర్యలుఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

*వేలంక, చిల్లంగి, జగపతినగరం రైతులకు తక్షణ సాగునీరు* *పెద్దనాపల్లి రెగ్యులేటర్ నుండి గోదావరి జలాలు విడుదల చేసేందుకు చర్యలు… ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ* కాకినాడ, కిర్లంపూడి, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 16 : సూపర్ ఎలినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కిర్లంపూడి మండలం వేలంక, చిల్లంగి, జగపతినగరం గ్రామాల రైతులకు తక్షణ సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి పోలవరం కాలువ రెగ్యులేటర్ నుండి ఏలేరు కాలువలోకి గోదావరి నీటిని విడుదల చేసేందుకు ఈరోజు ఆయన రెగ్యులేటర్ ను పరిశీలించి నీటి విడుదల సాధ్య సాధ్యాలను పరిశీలించారు . 40 సంవత్సరాలుగా ఈ కాల్వ ద్వారా నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త అందింది ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చితే ఈ గ్రామాల్లోని వేలాది ఎకరాల పంటలకు సాగునీరు అందనుంది. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, సూపర్ ఎలినో కారణంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎక్కడ నీరు అందుబాటులో ఉంటే అక్కడి నుంచి ఒడిసిపట్టి రైతులకు అందించాలని నిర్ణయించామని తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు పెద్దనాపల్లి రెగ్యులేటర్ నుండి గోదావరి నీళ్లుఏలేరు కాలువ ద్వారా ఈ గ్రామాలకు అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చూసే బాధ్యత మనందరిది. ఇప్పటికే అధికారులతో సమన్వయం చేసి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాం” అని జ్యోతుల నెహ్రూ అన్నారు.ఈ కార్యక్రమంలో చదరం చంటిబాబు, తూము కుమార్, బోదిరెడ్ల సుబ్బారావు, కుర్ల చినబాబు, గండే కాశి, కాళ్ల వెంకటేష్, బొడ్డేటి సుమన్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

*వేలంక, చిల్లంగి, జగపతినగరం రైతులకు తక్షణ సాగునీరు*
*పెద్దనాపల్లి రెగ్యులేటర్ నుండి గోదావరి జలాలు విడుదల చేసేందుకు చర్యలు… ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ*

కాకినాడ, కిర్లంపూడి, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 16 : సూపర్ ఎలినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కిర్లంపూడి మండలం వేలంక, చిల్లంగి, జగపతినగరం గ్రామాల రైతులకు తక్షణ సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చర్యలు తీసుకుంటున్నారు.
ఈరోజు ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి పోలవరం కాలువ రెగ్యులేటర్ నుండి ఏలేరు కాలువలోకి గోదావరి నీటిని విడుదల చేసేందుకు ఈరోజు ఆయన రెగ్యులేటర్ ను పరిశీలించి నీటి విడుదల సాధ్య సాధ్యాలను పరిశీలించారు . 40 సంవత్సరాలుగా ఈ కాల్వ ద్వారా నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త అందింది ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చితే ఈ గ్రామాల్లోని వేలాది ఎకరాల పంటలకు సాగునీరు అందనుంది.
ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, సూపర్ ఎలినో కారణంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎక్కడ నీరు అందుబాటులో ఉంటే అక్కడి నుంచి ఒడిసిపట్టి రైతులకు అందించాలని నిర్ణయించామని తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు పెద్దనాపల్లి రెగ్యులేటర్ నుండి గోదావరి నీళ్లుఏలేరు కాలువ ద్వారా ఈ గ్రామాలకు అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చూసే బాధ్యత మనందరిది. ఇప్పటికే అధికారులతో సమన్వయం చేసి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాం” అని జ్యోతుల నెహ్రూ అన్నారు.ఈ కార్యక్రమంలో చదరం చంటిబాబు, తూము కుమార్, బోదిరెడ్ల సుబ్బారావు, కుర్ల చినబాబు, గండే కాశి, కాళ్ల వెంకటేష్, బొడ్డేటి సుమన్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.