ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నాయని ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకులు పేర్నాటి కోటేశ్వరరెడ్డి విమర్శించారు. “అచ్చేదిన్ అచ్చేదిన్” అంటూ ప్రజలకు హామీలు ఇవ్వడం కాదు, ధరల భారాన్ని తగ్గిస్తూ పాలన సాగించాలన్నారు. ప్రస్తుతం ప్రజలకు “అచ్చేదిన్” కాకుండా “సచ్చే దిన్” వస్తున్నాయని ఎద్దేవా చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సూచనలతో సోమవారం ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా పేర్నాటి కోటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి గెలిచిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ప్రజలపై ధరల భారం మోపుతోందన్నారు. పెట్రోల్ వాడొద్దు, బంగారం కొనొద్దు అంటూ ప్రజలకు ప్రత్యామ్నాయాలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో ఉండటం వల్ల రవాణా ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ప్రజలపై అదనపు భారం పడకుండా పాలన సాగిందని, ప్రస్తుతం హామీలు ఇచ్చి అమలు చేయని పరిస్థితి నెలకొందన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ హెచ్ ఆదిశేషయ్య, గంగవరపు శ్రీనివాసులునాయుడు, జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రటరీ పులిమి రమేష్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ విభాగ నియోజకవర్గ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
అలాగే ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు కూనం సుధాకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కంటాబత్తిన రఘునారెడ్డి, మర్రిపాడు వైఎస్సార్సీపీ కన్వీనర్ చెన్ను వెంకటేశ్వరరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు ఆండ్రా సుబ్బారెడ్డి, నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ యాక్టివిటీ సెక్రటరీ బట్రెడ్డి జనార్థన్ రెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్ టీఏ వింగ్ వైస్ ప్రెసిడెంట్ మెట్టుకూరు సుబ్బారెడ్డి, అనంతసాగరం వైస్ ఎంపీపీ అల్లంపాటి సుధాకర్ రెడ్డి, కామాక్షయ్యనాయుడు, ఇందూరు సురేంద్రరెడ్డి, నారాయణరెడ్డి, వెంగళరెడ్డి, కొప్పోలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులునాయుడు, గడ్డం శ్రీనివాసులరెడ్డి, రవికుమార్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, అశోక్, మాల్యాద్రి, మస్తాన్, వెంకటరెడ్డి, గిరి, శ్రీనివాసులరెడ్డి, షారూక్, నాగరాజు, మధు, బాలచెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.


