దేశంలో బయో ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 22%, 25%, 27% మరియు 30% ఎథనాల్ మిశ్రమంతో విక్రయించే పెట్రోల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని మినహాయించింది. ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ ఉత్పత్తి సమయంలో ద్వంద్వ పన్ను విధానం ఏర్పడకుండా చూడడమే ఈ చర్య లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 20% వరకు ఎథనాల్ మిశ్రమానికి ఇప్పటికే రాయితీలు అమల్లో ఉండగా, ఇప్పుడు అధిక మిశ్రమాలకు కూడా వర్తింపజేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల దేశీయ ఎథనాల్ ఉత్పత్తికి ఊతం లభించడంతో పాటు దిగుమతి చేసుకునే చమురుపై ఆధారపడే స్థాయి తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

పెట్రోల్‌లో అధిక ఎథనాల్ మిశ్రమానికి కేంద్రం ప్రోత్సాహం