పెంచలకోన క్షేత్రంలో వైభవంగా జరిగిన తిరుచ్చి పల్లకి సేవ. స్వామివారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవలో పాల్గొన్న భక్తులు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో శనివారం సందర్భంగా చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి సమేత నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఉదయం స్వామి వారికి శాస్త్రోక్తంగా అభిషేకం, శ్రీ వార్ల కళ్యాణోత్సవాన్ని అర్చకులు కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం భక్తులు సమర్పించిన గొడుగులతో శ్రీస్వామి వారి ‘తిరుచ్ఛి సేవ’ అత్యంత వైభవంగా సాగింది. ప్రధానార్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు, గిరిజనుల సాంప్రదాయ వాయిద్యాల నడుమ వేడుకలు వైభవంగా సాగాయి. ఈ శనివారం రోజున స్వామివారికి జరిగిన అన్ని సేవల ద్వారా ఆలయానికి రూ. 11,79,036/- ఆదాయం సమకూరినట్లు ఆలయ ఉప కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

పెంచలకోనలో వైభవంగా తిరుచ్చి పల్లకి సేవ
పెంచలకోన క్షేత్రంలో వైభవంగా జరిగిన తిరుచ్చి పల్లకి సేవ. స్వామివారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవలో పాల్గొన్న భక్తులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో శనివారం సందర్భంగా చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి సమేత నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఉదయం స్వామి వారికి శాస్త్రోక్తంగా అభిషేకం, శ్రీ వార్ల కళ్యాణోత్సవాన్ని అర్చకులు కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం భక్తులు సమర్పించిన గొడుగులతో శ్రీస్వామి వారి ‘తిరుచ్ఛి సేవ’ అత్యంత వైభవంగా సాగింది. ప్రధానార్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు, గిరిజనుల సాంప్రదాయ వాయిద్యాల నడుమ వేడుకలు వైభవంగా సాగాయి. ఈ శనివారం రోజున స్వామివారికి జరిగిన అన్ని సేవల ద్వారా ఆలయానికి రూ. 11,79,036/- ఆదాయం సమకూరినట్లు ఆలయ ఉప కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

