*స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి తృతీయ సాక్షాత్కార సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి*
*అంబాబత్తుల అండకొండరాముడు –
దేవస్థానం పునః ప్రారంభకులు, కార్యనిర్వహకులు, అర్చకుడు*
నంది పత్రిక ఖాజీపేట ప్రతినిధి
జూలై 15
వైస్సార్ కడప జిల్లా వల్లూరు మండలం
కొట్లూరు పంచాయతీ లోని పుష్పాచలం కొండపై వెలిసిన స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం నీ కాకతీయ కాలంనాటి చరిత్ర కలిగిన దేవస్థానం, కాలక్రమేనా శిదిలావస్థకి చేరి దుండిగల చేత ధ్వంసం అయినా దేవస్థానం అయితే 2023 వ సంవత్సరం మే 1 న దేవస్థానం అంబా బత్తుల అండకొండరాముడు చే పునః ప్రారంభించబడినది.2023 జ్యేష్ఠ అమావాస్య రోజు అంబాబత్తుల అండకొండరాముడు కి లింగ రూపంలో శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దర్శనం ఇవ్వడం జరిగింది . ఆ యొక్క మధుర ఘట్టాన్ని ప్రతి సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య రోజున సాక్షాత్కార సంబరాలు నిర్వహిస్తూ రావడం ఒక ఆనవాయితీగా ఏర్పడింది. శ్రీ పరాభవ నామ సంవత్సరం నిజ జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజున తృతీయ వార్షికోత్సవ సాక్షాత్కార సంబరాలలో స్వామివారికి భస్మాభిషేకం, విశేష పూజలు, పంచామృత అభిషేకాలు, అర్చనలు జరిగాయి వచ్చిన భక్తాదులు స్వామివారికి కాయ కర్పూరం సమర్పించారు. శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన కొండ క్రింద అన్నదానం లో పుష్పాచల కొండ చుట్టూ ఉన్న భక్తాదులు పాల్గొని స్వామివారి మహా 500 మంది పైగా మహా నైవేద్యాన్ని స్వీకరించారు. కొట్లూరు పంచాయితీ సర్పంచ్ తెలిదల హేమలత గారి తండ్రి పుల్లయ్య, వల్లూరు మండలం తెలుగుదేశం నాయకులు లేపాక నాగేశ్వర్ రెడ్డి గారు , గ్రామ పెద్దలు, భక్తాదులు తదితరులు పాల్గొని స్వామివారికి పూజలు చేశారు అని స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం పునః ప్రారంభకులు, కార్యనిర్వహకులు , అర్చకుడు అంబాబత్తుల అండకొండరాముడు, శ్రీమతి శ్యామలాదేవి, కిషోర్ యాదవ్, అబ్బాయిగారు వెంకట సాయి, శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ బృందం విశేష సేవలందించారని తెలిపారు
Uploaded Video:

