Monday, 11 May 2026
  • Home  
  • పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 11 (పున్నమి ప్రతినిధి).వెంకటాచలం సీతారాం టోల్‌ప్లాజా వద్ద సివిల్ సప్లైస్ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 33 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో AP 39 T 3519 లారీ గుంటూరు జిల్లా నుంచి బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, లారీని భద్రపరిచి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తనిఖీల్లో సివిల్ సప్లైస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.