Friday, 25 September 2026
  • Home  
  • ఆయిల్ పామ్ రైతుల నోట్లో మట్టి కొట్టేలా కేంద్ర నిర్ణయం: తుమ్మల
- ఖమ్మం

ఆయిల్ పామ్ రైతుల నోట్లో మట్టి కొట్టేలా కేంద్ర నిర్ణయం: తుమ్మల

ఖమ్మం: ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహిస్తూ, మరోవైపు దిగుమతి సుంకాన్ని తగ్గించడం కేంద్రం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. క్రూడ్ పామ్ ఆయిల్‌పై మొత్తం దిగుమతి సుంకాన్ని 16.5 శాతం నుంచి 11 శాతానికి తగ్గించడంతో దేశీయంగా ఆయిల్ పామ్ గెలల ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 44 శాతం దిగుమతి సుంకాన్ని కోరుతున్న సమయంలో కేంద్రం సుంకం తగ్గించడం సరికాదన్నారు. రాష్ట్రంలో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో 88 వేలకుపైగా రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. FFBలకు టన్నుకు రూ.25 వేల కనీస హామీ ధర కల్పించాలని కేంద్రాన్ని కోరారు. దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని తక్షణమే పునఃసమీక్షించి దేశీయ రైతులకు ధర భరోసా కల్పించాలని తుమ్మల డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.