Thursday, 25 June 2026
  • Home  
  • పాడి రైతుల అభ్యున్నతికి కొత్త దిశగా కె.ఆర్ డెయిరి.. నేడు ఘన ప్రారంభం
- తిరుపతి

పాడి రైతుల అభ్యున్నతికి కొత్త దిశగా కె.ఆర్ డెయిరి.. నేడు ఘన ప్రారంభం

పాడి రైతుల అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని చిట్వేల్ మండల పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన కె.ఆర్ డెయిరి నేడు (జూన్ 25) ఘనంగా ప్రారంభం కానుంది. ఉదయం 7.30 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డెయిరి నిర్వాహకులు కట్టా రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాడి రైతులకు మెరుగైన సేవలు అందించడం, పాలు సేకరణలో పారదర్శక విధానాలు అమలు చేయడం, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం, రైతులకు సకాలంలో చెల్లింపులు చేయడం వంటి అంశాలను ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాల ఉత్పత్తిని ప్రోత్సహించి రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించేందుకు కె.ఆర్ డెయిరి కృషి చేస్తుందని తెలిపారు. డెయిరి ద్వారా పాడి రైతులకు సాంకేతిక సలహాలు, పశుసంవర్థక అవగాహన కార్యక్రమాలు, నాణ్యమైన పశుగ్రాసం అందుబాటులోకి తీసుకురావడం, పాల ఉత్పత్తి పెంపునకు అవసరమైన మార్గదర్శకాలు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ మండలంలోని ప్రతి గ్రామంతో అనుబంధాన్ని పెంపొందించుకోవాలని సంకల్పించినట్లు తెలిపారు. ఈ శుభ సందర్భంగా చిట్వేల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, పాడి రైతులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తమ అమూల్యమైన ఆశీస్సులు, అభినందనలు ఎల్లప్పుడూ కె.ఆర్ డెయిరిపై ఉండాలని కట్టా రామ్మోహన్ నాయుడు మనస్ఫూర్తిగా కోరారు.

పాడి రైతుల అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని చిట్వేల్ మండల పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన కె.ఆర్ డెయిరి నేడు (జూన్ 25) ఘనంగా ప్రారంభం కానుంది. ఉదయం 7.30 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డెయిరి నిర్వాహకులు కట్టా రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాడి రైతులకు మెరుగైన సేవలు అందించడం, పాలు సేకరణలో పారదర్శక విధానాలు అమలు చేయడం, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం, రైతులకు సకాలంలో చెల్లింపులు చేయడం వంటి అంశాలను ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాల ఉత్పత్తిని ప్రోత్సహించి రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించేందుకు కె.ఆర్ డెయిరి కృషి చేస్తుందని తెలిపారు.
డెయిరి ద్వారా పాడి రైతులకు సాంకేతిక సలహాలు, పశుసంవర్థక అవగాహన కార్యక్రమాలు, నాణ్యమైన పశుగ్రాసం అందుబాటులోకి తీసుకురావడం, పాల ఉత్పత్తి పెంపునకు అవసరమైన మార్గదర్శకాలు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ మండలంలోని ప్రతి గ్రామంతో అనుబంధాన్ని పెంపొందించుకోవాలని సంకల్పించినట్లు తెలిపారు.
ఈ శుభ సందర్భంగా చిట్వేల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, పాడి రైతులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తమ అమూల్యమైన ఆశీస్సులు, అభినందనలు ఎల్లప్పుడూ కె.ఆర్ డెయిరిపై ఉండాలని కట్టా రామ్మోహన్ నాయుడు మనస్ఫూర్తిగా కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.