తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఉర్దూ తరగతుల నిర్వహణపై తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఆర్మూర్ మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో హిందీ తరగతుల సమయంలో ఉర్దూ బోధిస్తున్నారనే ఆరోపణలతో బీజేపీ స్థానిక నాయకుడు మందుల బాలు తన అనుచరులతో కలిసి పాఠశాలలోకి ప్రవేశించి యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయగా ప్రధానోపాధ్యాయుడిపై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి బీజేపీ నాయకుడితో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులపై కూడా సామాజిక విభేదాలను రెచ్చగొట్టే ఆరోపణల కింద మరో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పాఠశాలలో ఉర్దూ తరగతుల వివాదం.. తెలంగాణలో బీజేపీ నాయకుడు అరెస్ట్