Wednesday, 30 September 2026
  • Home  
  • పల్లె పండుగ 3.0లో భాగంగా రూ. 4 కోట్లతో రామ సముద్రం రోడ్డుకు భూమి పూజ చేపట్టిన ఎమ్మెల్యే అమర్
- చిత్తూరు

పల్లె పండుగ 3.0లో భాగంగా రూ. 4 కోట్లతో రామ సముద్రం రోడ్డుకు భూమి పూజ చేపట్టిన ఎమ్మెల్యే అమర్

నిజాయితీని నిరూపించుకున్నాం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం పల్లె పండుగ 3.0లో భాగంగా రూ. 4 కోట్లతో రామ సముద్రం రోడ్డుకు భూమి పూజ చేపట్టిన ఎమ్మెల్యే అమర్ దశాబ్దాల కల నెరవేరుతుండడంతో స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న గ్రామస్తులు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుని తన నిజాయితీని నిరూపించుకున్నానని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి స్పష్టం చేశారు. బైరెడ్డిపల్లి మండలంలోని ఎం.కొత్తూరు పంచాయతీ పరిధిలోని కైగల్ నుండి సనిపల్లి వరకు వయా రామసముద్రం గ్రామానికి పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రూ. 4 కోట్లతో రోడ్డు నిర్మాణానికి ఆయన బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రామసముద్రం గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం తెలియజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఈఏపీ పథకం ద్వారా ప్రతి గ్రామానికి రోడ్లను మంజూరు చేయించానని అయితే అప్పట్లో ప్రతిపక్ష పార్టీ నేత తనపై అబద్ధపు ఆరోపణలు చేశారని దీంతో అప్పట్లో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు రామసముద్రం గ్రామానికి రోడ్డును తిరిగి మంజూరు చేయించి నిర్మిస్తున్నామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వందల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నప్పటికీ రామసముద్రం రోడ్డు ఏర్పాటుతో తన ఎమ్మెల్యే పదవికి సార్థకతతో పాటు రాజకీయ జీవితానికి ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఈ రోడ్డు నిర్మాణంతో తన నిజాయితీని నిరూపించుకున్నానని గతంలో చేసిన సవాల్ ను పూర్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా గత పాలకులు తనపై చేసిన అసత్యపు ఆరోపణలను మరియు వారి వైఫల్యాలను ఆయన తీవ్రంగా ఎండగట్టారు. ఇక కైగల్ ప్రాజెక్టుకు రూ.50 కోట్లు మంజూరు కానుందని మరోవైపు కైగల్ ప్రాంతంలో అతి పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కూడా జరగనుందని దీంతో ఈ ప్రాంత రూపు రేకలు మారనున్నాయని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడి మల్లికార్జున, తహసీల్దార్ ప్రసన్న కుమార్, ఎంపీడీవో ఆనంద, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కిషోర్ గౌడ, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శెట్టి, యువత నాయకులు భువనచంద్ర గౌడ్, జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ దిలీప్ కుమార్ తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

నిజాయితీని నిరూపించుకున్నాం

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం

పల్లె పండుగ 3.0లో భాగంగా రూ. 4 కోట్లతో రామ సముద్రం రోడ్డుకు భూమి పూజ చేపట్టిన ఎమ్మెల్యే అమర్

దశాబ్దాల కల నెరవేరుతుండడంతో స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న గ్రామస్తులు

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుని తన నిజాయితీని నిరూపించుకున్నానని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి స్పష్టం చేశారు. బైరెడ్డిపల్లి మండలంలోని ఎం.కొత్తూరు పంచాయతీ పరిధిలోని
కైగల్ నుండి సనిపల్లి వరకు వయా రామసముద్రం గ్రామానికి పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రూ. 4 కోట్లతో రోడ్డు నిర్మాణానికి ఆయన బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రామసముద్రం గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం తెలియజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఈఏపీ పథకం ద్వారా ప్రతి గ్రామానికి రోడ్లను మంజూరు చేయించానని అయితే అప్పట్లో ప్రతిపక్ష పార్టీ నేత తనపై అబద్ధపు ఆరోపణలు చేశారని దీంతో అప్పట్లో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు రామసముద్రం గ్రామానికి రోడ్డును తిరిగి మంజూరు చేయించి నిర్మిస్తున్నామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వందల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నప్పటికీ రామసముద్రం రోడ్డు ఏర్పాటుతో తన ఎమ్మెల్యే పదవికి సార్థకతతో పాటు రాజకీయ జీవితానికి ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఈ రోడ్డు నిర్మాణంతో తన నిజాయితీని నిరూపించుకున్నానని గతంలో చేసిన సవాల్ ను పూర్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా గత పాలకులు తనపై చేసిన అసత్యపు ఆరోపణలను మరియు వారి వైఫల్యాలను ఆయన తీవ్రంగా ఎండగట్టారు. ఇక కైగల్ ప్రాజెక్టుకు రూ.50 కోట్లు మంజూరు కానుందని మరోవైపు కైగల్ ప్రాంతంలో అతి పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కూడా జరగనుందని దీంతో ఈ ప్రాంత రూపు రేకలు మారనున్నాయని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడి మల్లికార్జున, తహసీల్దార్ ప్రసన్న కుమార్, ఎంపీడీవో ఆనంద, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కిషోర్ గౌడ, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శెట్టి, యువత నాయకులు భువనచంద్ర గౌడ్, జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ దిలీప్ కుమార్ తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.