గుంజపడుగు సర్పంచ్ దండెవేన సంధ్య బానేష్
పరిసరాల పరిశుభ్రత పై గ్రామంలో అందరూ అవగాహన కలిగి ఉండాలని గ్రామ సర్పంచ్ దండేవేన సంధ్య బానేష్ కోరారు. గురువారం మంథని మండలం గుంజపడుగు గ్రామంలో స్వచ్ఛతా హే సేవ కార్యక్రమంలో భాగంగా జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల విద్యార్థులకు పరిసరాలు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్త. శానిటరీ చెత్త గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించినట్లు ఆమె తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి అనారోగ్య కరమైన సమస్యలు ఉండవని ఆమె గుర్తు చేశారు. విద్యార్థిని విద్యార్థులందరూ మీ మీతల్లిదండ్రులకు పరిసరాల పరిశుభ్రత గురించి వివరించాలని, ప్లాస్టిక్ గ్రహీత గ్రామంగా స్వచ్ఛ గ్రామంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎలక లక్ష్మీ, దొడ్డిపట్ల శంకర్. దేవరకొండ పోచం, దేవళ్ళ లక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు శివ లీల, కార్యదర్శి సతీష్ కుమార్ తో పాటు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


