శ్రీకాళహస్తి, ఏప్రిల్ 22 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రేణిగుంట మండలం తూకివాకం గ్రామంలో రూ.76.89 కోట్ల వ్యయంతో నిర్మించిన 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని రాష్ట్ర ఇంధన శాఖ గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆయన ఈ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పరిశ్రమలు, కంపెనీలకు లో-వోల్టేజ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి మరిన్ని సబ్ స్టేషన్లు, విద్యుత్ కేంద్రాలను మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. కొత్త సబ్ స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల రైతులు, పరిశ్రమలు, సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులకు సహకరిస్తున్న మంత్రులు, అధికారులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

పరిశ్రమలు, రైతులకు మేలు చేసేలా తూకివాకం విద్యుత్ కేంద్రం