Saturday, 12 July 2025
  • Home  
  • పని చేసే చోట మానసిక ఆరోగ్య దినం
- Featured - బిజినెస్

పని చేసే చోట మానసిక ఆరోగ్య దినం

వృతి ్త జీవితం పున్నమి పాఠకులకు నమస్కారములు ఈ రోజు అనగా 22 అక్టోబరుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization (WHO), అంతర్జాతీయం గా ” పని చేసే చోట మానసిక ఆరోగ్య దినం ”(International Workplace Wellness Day) గా నిర్ణయించింది. ఈ సందర్భంగా, యాజమాన్యాలకు, మేనేజర్‌లకు, మరియు పని చేసే మనలాంటి వారికి, కొన్ని మార్గ దర్శక సూత్రాలు ( గైడ్‌ లైన్స్‌ ) సూచించింది. పని చేసే చోట మానసిక ఆరోగ్యం, ఉల్లాసం ఏర్పరచడం అనేది – పని తీసుకునే యాజమాన్యాల బాధ్యత . పని వారి హక్కు ఈ సందర్భంగా ఈ ఆర్టికల్‌ . ఈ రోజు ఆది వారం కాక పోయినా !! పున్నమికి ప్రత్యేకం . వర్క్‌ ప్లేస్‌ అనగా నేమి ? ఆ సందర్భంగా, వర్క్‌ ప్లేస్‌, అనగా పని చేసే చోట – అది ఆఫీసు కావచ్చు, లేక దుకాణం, షాపింగ్‌ మాల్‌, ఫ్యాక్టరీ, లేదా పొలం, లేక సేల్స్‌లో పని చేసే వారు, ఫీల్డ్‌ వర్క్‌ చేసే వారు అయితే బయటి ప్రపంచం రోడ్డు ఇవన్నీ వర్క్‌ ప్లేస్‌ క్రిందకే వస్తాయి. మన దగ్గరపని చేసే వారి మానసిక ఆరోగ్యం మీదనే, కంపెనీ ఆ ఆరోగ్యం ఆధార పడి ఉంటుంది. మొన్న , తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర సెక్యూరిటీ గా పని చేసే పోలీసు అధికారి , రివాల్వర్‌ తో కాల్చుకుని ఆత్మ హత్య చేసుకున్నారు. ఇంకా మరెందరో ఉద్యోగులు. యువ సాఫ్ట్‌ వేర్‌ / సెల్స్‌ ఉద్యోగులు. న్యూస్‌ లో చదువుతూ ఉంటాం. పని వత్తిడి, టార్గెట్‌ల వత్తిడి భరించ లేక, తాగుడుకిలోను కావడం, పెరిగి పోతున్న టెంపర్‌లు, విడాకుల సంఖ్య. అందుకే , మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యం !! ‘పనిచేసే చోట మానసికారోగ్యానికి కొన్ని సూచనలు . పనిచేసే చోట సంతోషానికి నియమాలు :- 1. ఎవరిపైనా అమిత విశ్వాసం ఉంచకండి కానీ అందరితో గౌరవంగా మెలగండి . 2. కార్యాలయాలలో జరిగేది కార్యాలయాలలో ఉంచాలి. కార్యాలయాలలో జరిగేవి ఇంటికికానీ, ఇంటి విషయాలు కార్యాలయాలకు గానీ మోసుకు రాకండి 3. సమయానికి రండి సమయానికి వెళ్ళండి. మీ కార్యాలయ మేజా మీ ఆరోగ్యాన్నేమీ మెరుగుపరచదు. 4. పనిచేసేచోట సంభంధబాంధవ్యాలు పెంచుకోకండి. అవి ప్రతికూల ఫలితాలు ఇస్తాయి. (స్నేహ భావంతో మెలగండి కానీ అంతా స్నేహితలని భ్రమపడవద్దు) 5. ఏదీ ఆశించకండి. ఎవరయినా సహాయం చేస్తే కతజ్ఞతాపూర్వకంగా ఉండండి, చేయకపోతే ఆ పని ఎలా చేయాలో మీరే నేర్చుకుంటారు. 6. హోదాలకోసం ఉర్రూతలూగకండి. పదోన్నతి (ప్రమోషన్‌) కలిగితే సంతోషం, లేకుంటే పోయేదేమీ లేదు, హోదా కన్నా మీ పనితీరు, మేధలపై ఎక్కువ గౌరవం ఆధారపడి ఉంటుంది. 7. కార్యాలయ విషయాల వెనకపడవద్దు. చేయటానికి ముఖ్యమయిన ఇతర పనులెన్నో ఉంటాయి. 8. ప్రతీ విషయం మీ అహం పై ప్రభావం చూపనీయవద్దు. మీరు చేసే పనికి జీతం వస్తుంది. మీ మేధ, బలాలతో సంతోషం వెతుక్కోండి. 9. మీతో ఇతరుల ప్రవర్తనను పట్టించుకోకండి. అందరికీ నచ్చేలా ఉండాలని లేదు. (గుర్తించుకోండి, అందరికీ నచ్చేలా ఉండాలని ప్రయత్నించడము వైఫల్యాలకు దగ్గరి దారి) 10. చివరగా ఇల్లు, కుటుంబం, స్నేహితులు, స్వీయమనశ్శాంతి వీటి కన్నా ఏదీ ఎక్కువ కాదు . (ఈ వ్యాసం రెండవ భాగం , వచ్చే మంగళవారం, అనగా 29 అక్టోబరు ) ఈ వ్యాసం చదువుతున్న మీ అందరి సంపూర్ణ మానసిక ఆరోగ్యాన్ని మనస్ఫూర్తిగా కోరు కుంటూ…. మీ సి.వి.రమణ, హైదరాబాద్‌ Also read ఉద్యోగం-వేటలో-మనం-చెయ్యక

వృతి ్త జీవితం

పున్నమి పాఠకులకు నమస్కారములు ఈ రోజు అనగా 22 అక్టోబరుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization (WHO), అంతర్జాతీయం గా ” పని చేసే చోట మానసిక ఆరోగ్య దినం ”(International Workplace Wellness Day) గా నిర్ణయించింది.
ఈ సందర్భంగా, యాజమాన్యాలకు, మేనేజర్‌లకు, మరియు పని చేసే మనలాంటి వారికి, కొన్ని మార్గ దర్శక సూత్రాలు ( గైడ్‌ లైన్స్‌ ) సూచించింది.
పని చేసే చోట మానసిక ఆరోగ్యం,
ఉల్లాసం ఏర్పరచడం అనేది – పని తీసుకునే యాజమాన్యాల బాధ్యత . పని వారి హక్కు ఈ సందర్భంగా ఈ ఆర్టికల్‌ . ఈ రోజు ఆది వారం కాక పోయినా !! పున్నమికి ప్రత్యేకం .
వర్క్‌ ప్లేస్‌ అనగా నేమి ?
ఆ సందర్భంగా, వర్క్‌ ప్లేస్‌, అనగా పని చేసే చోట – అది ఆఫీసు కావచ్చు, లేక దుకాణం, షాపింగ్‌ మాల్‌, ఫ్యాక్టరీ, లేదా పొలం, లేక సేల్స్‌లో పని చేసే వారు, ఫీల్డ్‌ వర్క్‌ చేసే వారు అయితే బయటి ప్రపంచం రోడ్డు ఇవన్నీ వర్క్‌ ప్లేస్‌ క్రిందకే వస్తాయి. మన దగ్గరపని చేసే వారి మానసిక ఆరోగ్యం మీదనే, కంపెనీ ఆ ఆరోగ్యం ఆధార పడి ఉంటుంది. మొన్న , తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర సెక్యూరిటీ గా పని చేసే పోలీసు అధికారి , రివాల్వర్‌ తో కాల్చుకుని ఆత్మ హత్య చేసుకున్నారు. ఇంకా మరెందరో ఉద్యోగులు. యువ సాఫ్ట్‌ వేర్‌ / సెల్స్‌ ఉద్యోగులు. న్యూస్‌ లో చదువుతూ ఉంటాం. పని వత్తిడి, టార్గెట్‌ల వత్తిడి భరించ లేక, తాగుడుకిలోను కావడం, పెరిగి పోతున్న టెంపర్‌లు, విడాకుల సంఖ్య. అందుకే , మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యం !!
‘పనిచేసే చోట మానసికారోగ్యానికి కొన్ని సూచనలు .
పనిచేసే చోట సంతోషానికి నియమాలు :-
1. ఎవరిపైనా అమిత విశ్వాసం ఉంచకండి కానీ అందరితో గౌరవంగా మెలగండి .
2. కార్యాలయాలలో జరిగేది కార్యాలయాలలో ఉంచాలి. కార్యాలయాలలో జరిగేవి ఇంటికికానీ, ఇంటి విషయాలు కార్యాలయాలకు గానీ మోసుకు రాకండి
3. సమయానికి రండి సమయానికి వెళ్ళండి. మీ కార్యాలయ మేజా మీ ఆరోగ్యాన్నేమీ మెరుగుపరచదు.
4. పనిచేసేచోట సంభంధబాంధవ్యాలు పెంచుకోకండి. అవి ప్రతికూల ఫలితాలు ఇస్తాయి. (స్నేహ భావంతో మెలగండి కానీ అంతా స్నేహితలని భ్రమపడవద్దు)
5. ఏదీ ఆశించకండి. ఎవరయినా సహాయం చేస్తే కతజ్ఞతాపూర్వకంగా ఉండండి, చేయకపోతే ఆ పని ఎలా చేయాలో మీరే నేర్చుకుంటారు.
6. హోదాలకోసం ఉర్రూతలూగకండి. పదోన్నతి (ప్రమోషన్‌) కలిగితే సంతోషం, లేకుంటే పోయేదేమీ లేదు, హోదా కన్నా మీ పనితీరు, మేధలపై ఎక్కువ గౌరవం ఆధారపడి
ఉంటుంది.
7. కార్యాలయ విషయాల వెనకపడవద్దు. చేయటానికి ముఖ్యమయిన ఇతర పనులెన్నో ఉంటాయి.
8. ప్రతీ విషయం మీ అహం పై ప్రభావం చూపనీయవద్దు. మీరు చేసే పనికి జీతం వస్తుంది. మీ మేధ, బలాలతో సంతోషం వెతుక్కోండి.
9. మీతో ఇతరుల ప్రవర్తనను పట్టించుకోకండి. అందరికీ నచ్చేలా ఉండాలని లేదు. (గుర్తించుకోండి, అందరికీ నచ్చేలా ఉండాలని ప్రయత్నించడము వైఫల్యాలకు దగ్గరి దారి)
10. చివరగా ఇల్లు, కుటుంబం, స్నేహితులు, స్వీయమనశ్శాంతి వీటి కన్నా ఏదీ ఎక్కువ కాదు . (ఈ వ్యాసం రెండవ భాగం , వచ్చే మంగళవారం, అనగా 29 అక్టోబరు ) ఈ వ్యాసం చదువుతున్న మీ అందరి సంపూర్ణ మానసిక ఆరోగ్యాన్ని మనస్ఫూర్తిగా కోరు కుంటూ….
మీ సి.వి.రమణ, హైదరాబాద్‌

Also read ఉద్యోగం-వేటలో-మనం-చెయ్యక

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.