ఉదయగిరి సబ్‌డివిజన్ పరిధిలోని రైతులు పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏడీఏ చెన్నారెడ్డి కోరారు. ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన వరి, వేరుశనగ పంటలకు బీమా వర్తిస్తుందని తెలిపారు. వరి పంటకు ఎకరాకు రూ.840, వేరుశనగ పంటకు ఎకరాకు రూ.280 చొప్పున నిర్ణయించిన గడువులోగా ప్రీమియం చెల్లించాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, కరువు తదితర కారణాలతో పంట నష్టం సంభవించినప్పుడు బీమా పథకం ద్వారా ప్రభుత్వం పరిహారం అందిస్తుందని చెప్పారు. రైతులు ఆలస్యం చేయకుండా బీమా నమోదు పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: రైతులకు ఏడీఏ చెన్నారెడ్డి పిలుపు