బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన నెల్లూరు జిల్లా ఆర్డివో హుస్సేన్ సాహెబ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో, తాసిల్దార్ లకు ఎన్నికలు నిర్వహించవలసిన విధివిధానాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించబడునని, 16వ తేదీ ఉపసంహరణలను పరిశీలించి పూర్తి నివేదిక అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరసింహారావు, తాసిల్దార్ షఫీ మాలిక్, స్పెషల్ ఆఫీసర్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన నెల్లూరు జిల్లా ఆర్డివో హుస్సేన్ సాహెబ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో, తాసిల్దార్ లకు ఎన్నికలు నిర్వహించవలసిన విధివిధానాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించబడునని, 16వ తేదీ ఉపసంహరణలను పరిశీలించి పూర్తి నివేదిక అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరసింహారావు, తాసిల్దార్ షఫీ మాలిక్, స్పెషల్ ఆఫీసర్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.