Thursday, 13 August 2026
  • Home  
  • నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలి 4,225 మంది ఓటర్లకు నోటీసుల జారీ.. 33 పోలింగ్‌ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన
- తిరుపతి

నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలి 4,225 మంది ఓటర్లకు నోటీసుల జారీ.. 33 పోలింగ్‌ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన

రామచంద్రపురం ఆగస్టు 13 పున్నమి ప్రతినిధి రామచంద్రపురం మండలంలో సర్‌ 2026 ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసుల జారీ, పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఎమ్మార్వో మధుసూదన్‌రావు సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలవ్యాప్తంగా మొత్తం 4,225 మంది ఓటర్లకు బీఎల్‌వోలు నోటీసులు అందించినట్లు తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు మండలంలోని 33 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో నోటీసులు అందుకున్న ఓటర్లు తమకు కేటాయించిన తేదీల్లో సంబంధిత అసలు ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. ఓటర్ల వివరాలు, ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించనున్నట్లు తెలిపారు. నిర్ణీత తేదీల్లో సంబంధిత ఓటర్లు తప్పనిసరిగా హాజరై అవసరమైన పత్రాలను సమర్పించాలని ఎమ్మార్వో సూచించారు. నోటీసులు అందుకున్నప్పటికీ నిర్ణీత సమయంలో హాజరై ధ్రువపత్రాలు సమర్పించని వారి ఓట్లను నిబంధనల మేరకు తొలగించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో బీఎల్‌వోలు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నోటీసుల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

రామచంద్రపురం ఆగస్టు 13 పున్నమి ప్రతినిధి

రామచంద్రపురం మండలంలో సర్‌ 2026 ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసుల జారీ, పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఎమ్మార్వో మధుసూదన్‌రావు సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలవ్యాప్తంగా మొత్తం 4,225 మంది ఓటర్లకు బీఎల్‌వోలు నోటీసులు అందించినట్లు తెలిపారు.
ఈ నెల 17వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు మండలంలోని 33 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో నోటీసులు అందుకున్న ఓటర్లు తమకు కేటాయించిన తేదీల్లో సంబంధిత అసలు ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. ఓటర్ల వివరాలు, ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించనున్నట్లు తెలిపారు.
నిర్ణీత తేదీల్లో సంబంధిత ఓటర్లు తప్పనిసరిగా హాజరై అవసరమైన పత్రాలను సమర్పించాలని ఎమ్మార్వో సూచించారు. నోటీసులు అందుకున్నప్పటికీ నిర్ణీత సమయంలో హాజరై ధ్రువపత్రాలు సమర్పించని వారి ఓట్లను నిబంధనల మేరకు తొలగించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో బీఎల్‌వోలు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నోటీసుల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.