గూడూరు సెప్టెంబర్ 8:
విద్యార్థులు నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్ సూచించారు. స్థానిక ఎస్.కె.ఆర్. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్పొరేషన్ విజయవాడ మరియు కళాశాల నైపుణ్యాభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అందుబాటులో ఉన్న వివిధ నైపుణ్య శిక్షణా అవకాశాలు, వాటి ద్వారా ఉపాధి మరియు స్వయం ఉపాధి పొందే మార్గాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు విద్యార్హతలతో పాటు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతో అవసరమని, విద్యార్థులు శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవడంతో పాటు భవిష్యత్తులో స్వయం ఉపాధి పొందే దిశగా ముందుకు సాగాలని సూచించారు. అదేవిధంగా నిర్వాహకులు శ్రీ ఆంజనేయులు, కన్వీనర్ శ్రీమతి బి. శైలజ, నిరుద్యోగులు మరియు యువతకు అందుబాటులో ఉన్న వివిధ అవకాశాలను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఎస్. కిరణ్మయి, అధ్యాపకులు శ్రీమతి ఎస్. మైమూస్, డాక్టర్ గోవిందు సురేంద్ర, వి.వి. రమణా రెడ్డి తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నైపుణ్య శిక్షణతో విద్యార్థులకు స్వయం ఉపాధి అవకాశాలు
గూడూరు సెప్టెంబర్ 8: విద్యార్థులు నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్ సూచించారు. స్థానిక ఎస్.కె.ఆర్. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్పొరేషన్ విజయవాడ మరియు కళాశాల నైపుణ్యాభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అందుబాటులో ఉన్న వివిధ నైపుణ్య శిక్షణా అవకాశాలు, వాటి ద్వారా ఉపాధి మరియు స్వయం ఉపాధి పొందే మార్గాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు విద్యార్హతలతో పాటు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతో అవసరమని, విద్యార్థులు శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవడంతో పాటు భవిష్యత్తులో స్వయం ఉపాధి పొందే దిశగా ముందుకు సాగాలని సూచించారు. అదేవిధంగా నిర్వాహకులు శ్రీ ఆంజనేయులు, కన్వీనర్ శ్రీమతి బి. శైలజ, నిరుద్యోగులు మరియు యువతకు అందుబాటులో ఉన్న వివిధ అవకాశాలను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఎస్. కిరణ్మయి, అధ్యాపకులు శ్రీమతి ఎస్. మైమూస్, డాక్టర్ గోవిందు సురేంద్ర, వి.వి. రమణా రెడ్డి తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

