చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
నేడు చేజర్ల మండల వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నట్లు ఎమ్మార్వో మురళి తెలిపారు. ఈ రేషన్ కార్డ్ పైన ప్రభుత్వ అధికారిక చిహ్నం మరియు కుటుంబ పెద్ద ఫోటో ఉంటుందని మరియు కుటుంబ సభ్యుల వివరాలు, లింగము, ఏ రేషన్ షాపు, ఎక్కడ సరుకులు తీసుకుంటున్నది,ఈకెవైసీ లాంటి మొత్తం వివరాలన్నీ కార్డులో నిక్షిప్తమై ఉంటాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి ఈ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు.


